car: కారుతో స‌హా వ‌ర‌ద‌నీటిలో చిక్కుకున్న మ‌హిళ‌... కాపాడిన పోలీసులు.. వీడియో చూడండి

  • గుర్తించిన స్థానికులు
  • కాపాడిన బెంగ‌ళూరు పోలీసులు
  • సోష‌ల్ మీడియాలో ప్రత్య‌క్ష‌మైన వీడియో

విప‌రీతంగా కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా బెంగ‌ళూరు రోడ్లు న‌దుల‌ను త‌ల‌పిస్తున్నాయి. చెరువుల్లా మారిన రోడ్ల కార‌ణంగా ఇప్ప‌టికే ఐదుగురు మృత్యువాత ప‌డ్డారు. ఇక విషయానికి వస్తే, రోడ్డు మీద నీళ్ల‌లో ఓ కారు తేలుతూ పోవ‌డాన్ని స్థానికులు గ‌మ‌నించారు. కొద్దిసేప‌టికి ఆ కారు లోప‌ల మ‌హిళ ఉన్న‌ట్లు గుర్తించారు.

 వెంట‌నే న‌లుగురు వ్య‌క్తులు వెళ్లి ఆమెను కారు నుంచి బ‌య‌టికి తీసుకువ‌చ్చారు. వారిలో ముగ్గురు బెంగ‌ళూరు పోలీసుశాఖ‌లో ప‌నిచేస్తున్న‌ట్లు స‌మాచారం. దీనికి సంబంధించిన వీడియో ఒక‌టి ఇవాళ సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఈ వీడియో చూసిన వారంతా పోలీసుల సాహ‌సాన్ని మెచ్చుకుంటూ వీడియోను షేర్ చేసి, వైర‌ల్‌గా మారుస్తున్నారు.

More Telugu News