brahmastra: `బ్ర‌హ్మాస్త్ర‌` సినిమాకు రూ. 100 కోట్లు దాట‌నున్న బ‌డ్జెట్‌?

  • ఎంత‌కైనా సిద్ధ‌మ‌న్న క‌ర‌ణ్ జొహార్‌
  • ర‌ణ్‌బీర్-ఆలియా భ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో సినిమా
  • మూడు భాగాలుగా రానున్న చిత్రం
ర‌ణ్‌బీర్-ఆలియా భ‌ట్ ప్ర‌ధాన తారాగ‌ణంగా బాలీవుడ్ నిర్మాత క‌ర‌ణ్ జొహార్ నిర్మించ‌నున్న చిత్రానికి దాదాపు రూ. 100 కోట్ల‌కు పైగా ఖ‌ర్చుపెట్టేందుకు క‌ర‌ణ్ వెన‌కాడ‌టంలేద‌ని బాలీవుడ్ వ‌ర్గాలు చెప్పుకుంటున్నాయి. అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వంలో మూడు భాగాలుగా రానున్న సీరీస్ లో ఇది మొదటిది. ఈ సినిమా క‌ర‌ణ్ నిర్మించిన సినిమాల్లో భారీ బ‌డ్జెట్ సినిమాగా నిలిచి‌పోనుంది.

ఇందులో అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర పోషించ‌నున్నారు. మొద‌టి సినిమాకే ఇంత ఖ‌ర్చుపెడుతున్నారంటే మిగ‌తా రెండు భాగాలకు క‌ర‌ణ్ ఎంత ఖ‌ర్చుపెడ‌తాడోన‌ని బాలీవుడ్‌లో చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఏదేమైనా ఒక ప్ర‌తిష్టాత్మ‌క సూప‌ర్ హీరో సినిమాను త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల‌కు క‌ర‌ణ్ అందించ‌నున్నాడ‌ని వారు చెప్పుకుంటున్నారు. ఈ చిత్రం మొద‌టి భాగాన్ని 2019 ఆగ‌స్టు 15న విడుద‌ల‌కు సిద్ధం చేయ‌నున్నారు.
brahmastra
karan johar
alia bhatt
ranbir kapoor
budget
bollywood
amitabh bachchan

More Telugu News