boyfriend: ప్రియుడిపై కోపాన్ని.. మెర్సిడెజ్ కారుపై తీర్చుకున్న ప్రియురాలు!

  • బిజినెస్ చేయ‌డానికి 50వేల డాల‌ర్లు అడిగిన ప్రేయ‌సి
  • కుద‌ర‌ద‌ని బంధానికి బ్రేక‌ప్ చెప్పిన ప్రియుడు
  • ల‌క్ష డాల‌ర్ల విలువైన కారును నీటి పాలు చేసింది

ర‌ష్యాకు చెందిన మోడ‌ల్ క్రిస్టినా కుచ్మా (24), న్యూయార్క్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ అయిన గై జెంటైల్ (41)ని ప్రేమించింది. ఇటీవ‌ల వారిద్ద‌రూ క‌లిసి బ‌హ‌మాస్ దేశానికి హాలీడే ట్రిప్‌కి వెళ్లారు. ఒక ముఖ్య‌మైన విష‌యం చెబుతానని క్రిస్టినా ప్రియుడ్ని ఊరించింది. ఇద్ద‌రు క‌లిసి మెర్సిడెజ్ కారులో అక్క‌డే ఒక హోట‌ల్‌కి వెళ్లారు. క్రిస్టినా గ‌ర్భ‌వ‌తి అయిందేమోన‌ని, ఆ విష‌య‌మే చెబుతుంద‌ని గై ఊహించాడు.

కానీ క్రిస్టినా వేరే విష‌యం చెప్పింది. త‌న‌కు బిజినెస్ చేయాల‌నుంద‌ని 50వేల డాల‌ర్లు స‌హాయం చేయాల‌ని కోరింది. గై కుద‌ర‌ద‌న్నాడు. `ఏ కార‌ణం లేకుండా 50 వేల డాల‌ర్లు ఎలా ఇవ్వ‌మంటావ్‌! వేరే చోటా ప్ర‌య‌త్నించుకో!` అన్నాడు. దీంతో క్రిస్టినాకు కోపం వ‌చ్చి, తాగుతున్న వేడి వేడి గ్రీన్ టీ‌ని గై మొహం మీద పోసింది. దాంతో కోపం వ‌చ్చిన గై, వారి ల‌వ్‌కి బ్రేక‌ప్ చెప్పాడు. క్రిస్టినా అక్క‌డి నుంచి ఉసూరుమంటూ వెళ్లిపోయింది.

అదే స‌మ‌యంలో మెర్సిడెజ్ బెంజ్ కారు తాళాల‌ను తీసుకెళ్లింది. బ‌య‌ట స్విమ్మింగ్ పూల్ ద‌గ్గ‌ర ఉన్న ల‌క్ష డాల‌ర్ల విలువైన‌ మెర్సిడెజ్ కారును ఈత‌కొల‌నులోకి తోసేసి `బ‌య‌ట నీకోసం స‌ర్‌ప్రైజ్ ఎదురుచూస్తుంది... వెళ్లి చూసుకో` అని గైకి మెసేజ్ చేసింది. గై ఆందోళ‌న చెందుతూ బ‌య‌టికి వ‌చ్చాడు. క్రిస్టినా కారులో ఉందేమోన‌ని తాను ఆందోళ‌న చెందిన‌ట్లు గై చెప్పాడు. కానీ ఆమె ఇలా చేస్తుంద‌ని అనుకోలేద‌ని, త‌న‌ను పెళ్లి కూడా చేసుకోవాల‌నుకున్నాన‌ని, ఆమె ఇలా చేయ‌డంతో ఆ ఆలోచ‌న మానుకున్న‌ట్లు గై వెల్ల‌డించాడు.

More Telugu News