chandrababu: విజయవాడలో రౌడీ అనేవాడే కనపడకూడదు.. తాట తీస్తా: చంద్రబాబు

  • రౌడీయిజం చేస్తే నగరం నుంచి బహిష్కరిస్తాం
  • రౌడీయిజం అనే మాట కూడా వినిపించకూడదు
  • పెట్రోలింగ్ పెంచాలంటూ కమిషనర్ కు ఆదేశం
విజయవాడ అంటేనే రౌడీయిజంకు కేరాఫ్ అడ్రస్ అని అందరూ భావిస్తుంటారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సీరియస్ గానే ఉన్నారు. విజయవాడలో రౌడీ అనేవాడే కనపడకూడదని... నగరంలోని రౌడీల తాట తీస్తానని ఆయన హెచ్చరించారు. రౌడీయిజం అనే మాట కూడా వినిపించకూడదని అన్నారు. రౌడీయిజం చేసేవారిని నగరం నుంచి బహిష్కరిస్తామని చెప్పారు.

విజయవాడలోని వాంబే కాలనీలో ఈరోజు చంద్రబాబు పర్యటించారు. తమ ప్రాంతంలో రౌడీల ఆగడాలు పెరిగిపోయాయంటూ ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా ఓ మహిళ ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు పట్ల స్పందించిన చంద్రబాబు నగరంలో రౌడీ అనేవాడు లేకుండా చేస్తానని చెప్పారు. వాంబే కాలనీలో తక్షణమే పెట్రోలింగ్ పెంచాలని పోలీస్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు. 
chandrababu
ap cm
vijayawada rowdyism

More Telugu News