srisailam project: శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తుతున్న వరద.. ఐదు గేట్లు ఎత్తివేత.. అద్భుతమైన వీడియోను మీరూ చూడండి!

  • ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద
  • ఇన్ ఫ్లో 2.04 క్యూసెక్కులు
  • నీటి మట్టం 884.40 అడుగులు  

డెడ్ స్టోరేజ్ లెవెల్ కు పడిపోయిన శ్రీశైలం ప్రాజెక్టుకు... ప్రస్తుతం జలకళ ఉట్టిపడుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుకు భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో, అధికారులు ఐదు గేట్లను ఎత్తివేసి... నీటిని కిందకు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రస్తుత ఇన్ ఫ్లో 2.04 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో 2.28 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. ప్రాజెక్టు నీటి నిల్వ కెపాసిటీ 215 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 211 టీఎంసీల నీరు ప్రాజెక్టులో ఉంది. గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం 884.40 అడుగుల మేర నీరు ఉంది.    

More Telugu News