apsrtc: బస్సు ఒకటే.. సగం ఏసీ.. సగం నాన్-ఏసీ.. ఏపీ ఎస్ఆర్టీసీ వినూత్న ప్రయోగం!

  • ఒకే బస్సులో సగం ఏసీ, సగం నాన్ ఏసీ సీట్లు
  • ఏసీకి వసూలు చేసిన ధరలో సగం ధరకు నాన్ ఏసీ టికెట్లు
  • ప్రయోగాత్మకంగా విజయవాడ- ఒంగోలు మధ్య సర్వీసులు

ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఒకే బస్సులో రెండు తరగతులు, రెండు రకాల టికెట్లు వసూలు చేసేందుకు సమాయత్తమవుతోంది. సూపర్ లగ్జరీ, నాన్ ఏసీ బస్సులకు ఆదరణ తగ్గుతున్న నేపథ్యంలో సరికొత్త ప్రయోగానికి తెరలేపింది. కొత్త బస్సులు కొనుగోలు చేయడం వల్ల వ్యయం పెరగడమే కాకుండా ఆక్యుపెన్సీ పెరిగే అవకాశం పెరుగుతుందని కచ్చితంగా చెప్పే అవకాశం లేదు.

ఈ నేపథ్యంలో ఇప్పటికే వినియోగంలో ఉన్న సూపర్‌ లగ్జరీ బస్సుల్లో మార్పులు చేయాలని ఏపీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. సగం సీట్ల వరకూ ఏసీ సౌకర్యం కల్పించేలా బస్సును రూపొందించారు. మిగిలిన సగం బస్సును నాన్‌-ఏసీగానే ఉంచనున్నారు. అంటే ఒకే బస్సులో సగం ఏసీ, మిగిలిన సగం నాన్ ఏసీగా పని చేయనుంది.

 ఈ డిజైన్‌ కు అనుగుణంగా బస్సు పికప్‌ సరిపోతుందో, లేదో కూడా పరిశీలించారు. ఇందుకు సరిపడా అవసరమైన మార్పులను ఇంజిన్ లో చేశారు. ఈ తరహా బస్సును విజయవాడ- ఒంగోలు మధ్య ప్రయోగాత్మకంగా త్వరలో నడపనున్నారు. ఈ సరికొత్త బస్సులను వంద కిలోమీటర్లపైబడిన ప్రాంతాలకు నడపాలని భావిస్తోంది. ఇంద్ర బస్సుల కంటే తక్కువ ధరలో ఈ ఏసీ బస్సు టికెట్ ధరలు వుంటాయి. అలాగే ఇదే బస్సులో ఏసీ సీట్లకు వసూలు చేసే ధరలో సగం ధరను నాన్ ఏసీ సీట్లకు వసూలు చేయాలని నిర్ణయించారు. 

More Telugu News