nivetha: చీర కట్టుకుని అందంగా ముస్తాబై .. చిరునవ్వులు చిందిస్తోన్న నివేదా థామస్ ఫొటోలు!

  • సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నివేదా థామస్
  • వరుస హిట్లతో దూసుకెళుతోన్న ముద్దుగుమ్మ
  • తెలుగింటి ఆడపడుచులా చీరకట్టు

‘జెంటిల్ మన్’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి మొద‌టి హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్న నివేదా థామ‌స్ ఆ త‌రువాత నిన్నుకోరి, జై లవకుశ సినిమాల్లోనూ న‌టించే చాన్స్ కొట్టేసి హ్యాట్రిక్ హిట్స్ సాధించింది. ఇప్పుడు ఈ అమ్మ‌డుని ఆఫ‌ర్లు వెతుక్కుంటూ వ‌స్తున్నాయి. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. త‌న‌ను త‌మ అమ్మాయే అని తెలుగువారు అంటున్నార‌ని ఇటీవ‌లే మురిసిపోతూ ఓ ట్వీట్ చేసింది.

ఇక ఈ రోజు ఆమె తెలుగింటి ఆడ‌ప‌డుచులా చ‌క్క‌ని చీర క‌ట్టుకుని, ముస్తాబై, చిరున‌వ్వులు చిందిస్తూ ఫొటోలు దిగింది. వాటిని ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసి సంబ‌ర‌ప‌డిపోయింది. 'శారీస్ స్పీక్..' అని పేర్కొంది. ఆమె చీర‌క‌ట్టు అభిమానుల‌ను అల‌రిస్తోంది.

  • Loading...

More Telugu News