honey preet: హ‌నీప్రీత్ మాజీ భ‌ర్త‌పై చర్యలు తీసుకోవాల‌ని కోరిన మ‌హిళా క‌మిష‌న్‌

  • పోలీసుల‌కు లేఖ రాసిన హ‌ర్యానా మ‌హిళా క‌మిష‌న్‌
  • ఆధారాలు లేకుండా ఆమె ప‌రువు తీస్తున్నాడ‌ని ఆరోప‌ణ‌
  • ప్రెస్‌మీట్‌లో హ‌నీప్రీత్ గురించి త‌ప్పుగా మాట్లాడాడ‌ని వ్యాఖ్య‌
డేరా బాబాకు, త‌న మాజీ భార్య హ‌నీప్రీత్‌కు మ‌ధ్య అక్ర‌మ సంబంధం ఉందంటూ మీడియా స‌మావేశం పెట్టి హనీప్రీత్ మాజీ భ‌ర్త విశ్వాస్ గుప్తా వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో ఎలాంటి ఆధారాలు లేకుండా హ‌నీప్రీత్ మీద ఆరోప‌ణ‌లు చేసి, ఆమె ప‌రువు తీస్తున్నాడంటూ హ‌ర్యానా మ‌హిళా క‌మిష‌న్ ఆరోపించింది. దీనికి సంబంధించి విశ్వాస్ గుప్తా మీద వెంట‌నే చ‌ర్య తీసుకోవాల‌ని లేఖ రాసింది. ఈ మేర‌కు బీజేపీ నాయ‌కురాలు, మ‌హిళా క‌మిష‌న్ చైర్మ‌న్ ప్ర‌తిభ సుమ‌న్‌, హ‌ర్యానా డీజీపీ బీఎస్ సాంధూకి తాను లేఖ రాసిన‌ట్లు పేర్కొన్నారు.

2009లోనే హ‌నీప్రీత్‌కి విడాకులిచ్చిన విశ్వాస్, ఇప్పుడు ఆమెపై నింద‌లు వేయ‌డం ఎంత‌వ‌ర‌కు స‌బ‌బు? అని ఆమె ప్ర‌శ్నించారు. విశ్వాస్ గుప్తాపై మాన‌వ హ‌క్కుల బృందం త‌నకు ఫిర్యాదు చేశారని, వారి ఫిర్యాదు మేర‌కే తాను లేఖ రాసిన‌ట్లు ప్ర‌తిభ సుమ‌న్ పేర్కొన్నారు.
honey preet
dera baba
gufa
panchakula
women commission
vishwas gupta
pratibha suman

More Telugu News