rajamouli: నెక్స్ట్ మూవీస్ గురించి క్లారిటీ ఇచ్చిన రాజమౌళి!

  • 'బాహుబలి 2'తో మరింతగా పెరిగిపోయిన రాజమౌళి క్రేజ్
  • సైలెంట్ గా నెక్స్ట్ మూవీకి సంబంధించిన పనులు 
  • అందరిలోనూ పెరుగుతోన్న ఆసక్తి

'బాహుబలి 2' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి .. నెలలు గడుస్తోంది. అయినా రాజమౌళి తన తదుపరి సినిమాను గురించి గానీ .. అందుకు సంబంధించిన విషయాలనుగాని ఎక్కడా ప్రస్తావించడం లేదు. దాంతో రాజమౌళి నెక్స్ట్ మూవీ ఏమిటనే ఆసక్తి అందరిలోను పెరిగిపోతోంది.

ఈ నేపథ్యంలో తాను ప్రస్తుతం చేయనున్న సినిమా గురించి .. ఆ తరువాత చేయనున్న ప్రాజెక్టు గురించి కూడా రాజమౌళి క్లారిటీ ఇచ్చేశారు. తన తదుపరి సినిమా సోషల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనుందని అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పారు. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించే ఈ సినిమా, ఓ స్టార్ హీరోతో వుంటుందని అన్నారు. ఇక వచ్చే ఏడాది కె.ఎల్. నారాయణ నిర్మాణంలో మహేశ్ బాబుతో ఓ సినిమా ఉంటుందని ఆయన చెప్పారు. ఈ లోగా మహేశ్ బాబు .. వంశీ పైడిపల్లి సినిమాను పూర్తి చేసేస్తాడన్న మాట.

More Telugu News