aamir khan: ఉప్పల్ టీ20 మ్యాచ్ కు విచ్చేస్తున్న ఊహించని అతిథి

  • మూడో టీ20కి విచ్చేస్తున్న ఆమిర్ ఖాన్
  • ఆహ్వానించిన కోహ్లీ
  • కోహ్లీ బహూకరించిన జర్సీతో సందడి చేయనున్న ఆమిర్ 

హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో ఈరోజు ఇండియా, ఆస్ట్రేలియాల మధ్య మూడో టీ20 జరగనుంది. అయితే, ఈ మ్యాచ్ కు ఊహించని అతిథి రాబోతున్నాడు. అతనెవరో కాదు, బాలీవుడ్ అగ్రనటుడు ఆమిర్ ఖాన్. ఈ మ్యాచ్ ను చూడ్డానికి రావాల్సిందిగా ఆమిర్ ను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరీమరీ కోరాడట. ఓ టీవీకి సంబంధించి దీపావళి స్పెషల్ ఎపిసోడ్ లో వీరిద్దరూ పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా హైదరాబాద్ లో జరిగే మ్యాచ్ ను చూడ్డానికి తప్పకుండా రావాలంటూ ఆమిర్ ను కోహ్లీ కోరాడు. క్రికెట్ టీమ్ బసచేస్తున్న హోటల్లోనే ఆమిర్ కు కూడా ఏర్పాట్లు జరిగినట్టు సమాచారం. మరో విషయం ఏమిటంటే... టీవీ షో సందర్భంగా ఆమిర్ కు విరాట్ కోహ్లీ ఓ జెర్సీని బహూకరించాడు. ఈ జెర్సీని ధరించే ఆమిర్ ఖాన్ మ్యాచ్ ను చూడనున్నట్టు తెలుస్తోంది. దంగల్ ఫేమ్ జైరా వసీమ్ తో కలసి ఆమిర్ వచ్చే అవకాశం ఉందని అతని సన్నిహితులు తెలిపారు. 

  • Loading...

More Telugu News