actress tabu: ఆ గాసిప్ లు విని.. అవి నా గురించేనా అనుకుంటా!: నటి టబూ

  • నా జీవితం గురించి చెప్పుకోవాలన్న ఆసక్తి లేదు
  • నాపై ఎన్నో గాసిప్స్ వినిపిస్తుంటాయి
  • అవి నా గురించేనా అనుకుంటుంటా
బాలీవుడ్ లో బయోపిక్ ల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే, బయోపిక్ ద్వారా కానీ, ఆటోబయోగ్రఫీ ద్వారా కానీ తన జీవితాన్ని ఎవరికీ చెప్పబోనని ప్రముఖ నటి టబూ తెలిపింది. తన జీవితం గురించి ఇతరులకు చెప్పాలన్న ఆసక్తి తనకు లేదని స్పష్టం చేసింది. ఆటోబయోగ్రఫీలు బాగానే ఉంటాయి... అయితే, వాటి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రజల్లో ఉండాలని చెప్పింది.

తన గురించి బయట ఎన్నో గాసిప్స్ వినిపిస్తుంటాయని... వాటిని విని, ఇవి తన గురించేనా అనుకుంటానని తెలిపింది. టబూ నటించిన 'గోల్ మాల్ ఎగైన్' సినిమా అక్టోబర్ 20న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో అజయ్ దేవగణ్, పరిణీతి చోప్రా, ప్రకాశ్ రాజ్ లు నటిస్తున్నారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా టబూ మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేసింది. 
actress tabu
bollywood
tabu on biopics

More Telugu News