nagarjuna: "మాట్లాడితే చై, చై అనేది... అప్పుడు నాకు అర్థం కాలేదు... నేనో ట్యూబ్ లైట్ ను" అంటున్న నాగార్జున వీడియో!

  • జీ తెలుగులో నాగ్ స్పెషల్ ప్రోగ్రామ్
  • పాత, కొత్త కబుర్లు చెప్పిన నాగార్జున
  • ఓ దశలో భావోద్వేగం
ప్రముఖ టీవీ చానల్ జీ తెలుగులో ప్రసారమయ్యే 'కొంచెం టచ్ లో ఉంటే చెబుతాను'లో పాల్గొన్న హీరో నాగార్జున పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. గతంలో తనతో మాట్లాడినప్పుడల్లా సమంత, చై చై అంటూ చైతన్య టాపిక్ ను తీసుకు వచ్చేదని, అప్పుడు తనకు అర్థం కాలేదని, తానో ట్యూబ్ లైట్ నని అన్నారు.

శివ చిత్రం షూటింగ్ సమయంలో జరిగిన ఘటనలనూ గుర్తు చేసుకున్నారు. 'బాటనీ పాఠముంది' పాట షూటింగ్ లో తాను అమలనే చూస్తూ కూర్చుండి పోయేవాడినని అన్నారు. అసలు కళ్లు కూడా తిప్పుకోలేకపోయేవాడినని అన్నారు. ఇప్పటికీ తాను ఇంట్లో వంట వండుతానని చెప్పారు.

ఆపై 'మనం' చిత్రం కోసం అక్కినేని నాగేశ్వరరావుపై తీసిన ఆఖరి షాట్ ను తెరపై చూసి భావోద్వేగానికి లోనయ్యారు. ఈ ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారం కానున్న కార్యక్రమం ప్రోమోను మీరూ చూడవచ్చు.


nagarjuna
zee telugu
samantha

More Telugu News