supreem court: 'శబరిమల' కేసు రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ!

  • మహిళల ప్రవేశంపై తీర్పివ్వని న్యాయస్థానం
  • ఐదుగురు సభ్యుల బెంచ్ కి రిఫర్
  • భక్తుల మనోభావాల కోసమేనన్న సుప్రీంకోర్టు

కేరళలోని ప్రతిష్ఠాత్మక శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి ఏ వయసులో ఉన్న మహిళలనైనా అనుమతించాలన్న వ్యాజ్యంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, ఈ విషయంలో తీర్పును వెలువరించలేకున్నామని, కేసును రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తున్నామని పేర్కొంది. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కేసును విచారించి తీర్పిస్తుందని, కోట్లాది మంది భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.

కాగా, ప్రస్తుతం 10 నుంచి 50 సంవత్సరాల వయసు మధ్యనున్న మహిళలను ఆలయంలోకి అనుమతించడం లేదన్న సంగతి తెలిసిందే. యంగ్ లాయర్స్ అసోసియేషన్ అనే సంస్థ, అయ్యప్ప దేవాలయంలో లింగ వివక్ష అమలవుతోందని, దీనిని నివారించాలని కోరుతూ సుప్రీంలో కేసు వేయడం జరిగింది.

  • Loading...

More Telugu News