raviteja: 'రాజా ది గ్రేట్' లో ఆ పాటకి విజిల్స్ పడతాయి : అనిల్ రావిపూడి

  • అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'రాజా ది గ్రేట్'
  • కథానాయికగా మెహ్రీన్
  • స్పెషల్ సాంగులో రాశి ఖన్నా 
  • ఇందులో తేజు కనిపిస్తాడనే వార్తలో నిజం లేదు  

'పటాస్' .. 'సుప్రీమ్' సినిమాలతో హిట్స్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి, తన తదుపరి చిత్రంగా 'రాజా ది గ్రేట్' సినిమాను తెరకెక్కించాడు. రవితేజ .. మెహ్రీన్ జంటగా నటించిన ఈ సినిమా, ఈ నెల 19వ తేదీన భారీ స్థాయిలో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి అనిల్ రావిపూడి మాట్లాడుతూ, బలమైన కథా కథనాలతో ఈ సినిమాను రూపొందించడం జరిగిందని చెప్పాడు.

 ఈ సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉంటాయనీ, విశ్రాంతి తరువాత వచ్చే పాటకి విజిల్స్ .. క్లాప్స్ పడతాయని అన్నాడు. ఈ పాట ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని చెప్పాడు. థియేటర్స్ లోని ప్రతి ఒక్కరూ ఈ పాటను ఎంజాయ్ చేస్తారని అన్నాడు. ఇక ఈ సినిమాలో రాశిఖన్నా స్పెషల్ సాంగ్ లో సాయిధరమ్ తేజ్ కూడా కనిపిస్తాడనే ప్రచారం జరుగుతోందనీ, అందులో ఎంతమాత్రం నిజం లేదంటూ తేల్చి చెప్పేశాడు.    

More Telugu News