subbaraju: అప్పుడు మాత్రం చాలా భయపడిపోయాను : సుబ్బరాజు

  • ఓ రాత్రివేళ ఫోన్ చేసిన ఫ్రెండ్
  • ప్లాట్ లో పాప .. పని అమ్మాయి మాత్రమే వున్నారు
  • ఇద్దరూ ఫోన్ రిసీవ్ చేసుకోవడం లేదు
  • 45 నిమిషాలు నరకం చూశాను  
నటుడు సుబ్బరాజు ఆరడుగుల ఆజానుబాహుడు .. మంచి కండపుష్టి కలిగినవాడు. అలాంటి తనని కూడా బాగా భయపెట్టిన  సంఘటన ఒకటి జరిగిందంటూ, అందుకు సంబంధించిన విషయాలను ఆయన ఐ డ్రీమ్స్ తో పంచుకున్నాడు. ఒకసారి తన ఎదురుగా వుండే ప్లాట్ లోని ఫ్రెండ్ సినిమా థియేటర్ నుంచి ఫోన్ చేశాడట. ఇంట్లో తమ పాప .. పని అమ్మాయి ఉన్నారనీ, కొంతసేపటిగా ఫోన్ చేస్తుంటే రిసీవ్ చేసుకోవడం లేదని చెప్పి .. వెళ్లి చూడమన్నారట.

దాంతో ఆ ప్లాట్ కి వెళ్లిన సుబ్బరాజు .. డోర్ లాక్ చేసి ఉండటంతో, ఎంతగా పిలిచినా ఎవరూ పలకలేదు. లోపలికి వెళ్లడానికి ఆయన చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దాంతో ఏదో జరిగి ఉంటుందని ఆయన చాలా భయపడిపోయాడు. బయటవున్న మెయిన్ ఆఫ్ చేసి .. అప్పుడు తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి ల్యాండ్ లైన్ కి ఫోన్ చేయమని చెప్పాడట. అలా చేసినప్పుడు పని అమ్మాయి .. పాప నిద్రలేచారని అన్నాడు. సెల్ ఫోన్ సైలెంట్ మోడ్ లో ఉండటం వలన .. ఏసీ ఆన్ లో ఉండటం వలన వాళ్లకి వినిపించలేదనీ .. తాను మాత్రం 45 నిమిషాలు నరకం చూశానని చెప్పుకొచ్చాడు.    
subbaraju

More Telugu News