ghost: మగవారిని దెయ్యం పొట్టనపెట్టుకుంటోందన్న భయంతో ఊరుని ఖాళీ చేస్తున్న గ్రామస్తులు!

  • మూడు నెలల్లో ముగ్గురు వ్యక్తుల మరణం
  • దెయ్యమే ఈ పని చేస్తోందని భయపడుతున్న గ్రామస్తులు
  • ఉన్నవారిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో గ్రామాన్ని వదిలి వెళ్తున్నారు
దెయ్యం భయంతో ఊరు మొత్తం ఖాళీ అవుతోంది. గ్రామంలో ఎక్కడ చూసినా తాళాలు వేసిన ఇళ్లే కనిపిస్తున్నాయి. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. బాబాపూర్ పంచాయతీకి అనుబంధంగా ఉన్న కాశీగూడ గ్రామంలో గత మూడు నెలల వ్యవధిలో ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఉండటంతో, గ్రామంలో కలకలం రేగింది. కేవలం మగవారే చనిపోతున్నారని... దెయ్యమే మగవారిని పొట్టనపెట్టుకుంటోందని గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. ఉన్నవారిని కాపాడుకునేందుకు గ్రామాన్ని వదిలి వెళుతున్నారు. 
ghost
ghost in nirmal district

More Telugu News