subbaraju: కృష్ణవంశీకి నేనెప్పుడూ దూరం కాలేదు : ఆర్టిస్ట్ సుబ్బరాజు

  • 'ఖడ్గం' సినిమాతో సుబ్బరాజు ఎంట్రీ
  • ఛాన్స్ ఇచ్చిన కృష్ణవంశీ
  • అందుకే ఆయనంటే గౌరవం
  • కృష్ణవంశీకి టచ్ లోనే వుంటాను     
తెలుగు తెరపై నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను ఎక్కువగా పోషించిన సుబ్బరాజు, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన 'ఖడ్గం' సినిమా ద్వారా ఆయన తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఆ తరువాత 'శ్రీ ఆంజనేయం' సినిమాలోనూ నటించాడు.

 అయితే, తనని పరిచయం చేసిన కృష్ణవంశీకి ఈ మధ్య కాలంలో సుబ్బరాజు దూరమయ్యాడనే టాక్ వచ్చింది. అదే ప్రశ్న ఆయనకి ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఎదురైంది. కృష్ణవంశీ అంటే తనకి ఎంతో గౌరవమనీ .. ఆయన ఒక అధ్యాపకుడి లాంటివారని సుబ్బరాజు చెప్పాడు. తాను ఉద్దేశ పూర్వకంగా కృష్ణవంశీకి దూరం కావడమంటూ ఎప్పుడూ జరగలేదనీ, వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉండటమే అందుకు కారణమని అన్నాడు. సమయం దొరికినప్పుడు ఆయనకి టచ్ లోకి వెళుతూనే ఉంటానని స్పష్టం చేశాడు.      
subbaraju

More Telugu News