big b: బిగ్ బీ బర్త్ డే వేడుకలు... మాల్దీవుల్లో సెలబ్రేట్ చేసిన అభిషేక్

  • అమితాబ్‌కి స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన కుటుంబ స‌భ్యులు
  • ప్రైవేట్ పార్టీ చేసుకున్న బ‌చ్చ‌న్ కుటుంబం
  • ఫొటోలు షేర్ చేసిన జూనియ‌ర్ బీ

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ 75వ పుట్టిన రోజు వేడుక‌ల కోసం బ‌చ్చ‌న్ కుటుంబం మొత్తం మాల్దీవుల‌కు వెళ్లింది. అక్క‌డ ప్రైవేట్ పార్టీ చేసుకుని బాగా ఎంజాయ్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ సంద‌ర్భంగా అభిషేక్ బ‌చ్చ‌న్‌, ఐశ్వ‌ర్య‌రాయ్ బ‌చ్చ‌న్‌, శ్వేతా నంద‌లు అమితాబ్‌కి ఓ స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు.

`హ్యాపీ బ‌ర్త్‌డే` ఆంగ్ల అక్ష‌రాల‌ను బాణసంచాతో వెలిగించి అమితాబ్‌కి విషెస్ చెప్పారు. అంతేకాకుండా ఒక పెద్ద కేకును అమితాబ్‌తో క‌ట్ చేయించారు. త‌ర్వాత క్రూయిజ్ పార్టీ కూడా చేసుకున్నారు. వీరంతా అక్క‌డి ఓ ల‌గ్జ‌రీ రిసార్ట్‌లో బ‌స చేశారు. వారి సెల‌బ్రేష‌న్‌కి సంబంధించిన ఫొటోల‌ను జూనియ‌ర్ బ‌చ్చ‌న్ త‌న ఇన్‌స్టాగ్రాం అకౌంట్లో పోస్ట్ చేశాడు. గ‌తేడాది అభిషేక్ బ‌చ్చ‌న్ పుట్టిన రోజును కూడా బ‌చ్చ‌న్ కుటుంబం మాల్దీవుల్లోనే సెల‌బ్రేట్ చేసుకుంది.

  • Loading...

More Telugu News