ys jagan: చంద్రబాబు ఏదైతే చెబుతున్నారో.. నాకున్న సమాచారం కూడా అదే: జగన్

  • ముందస్తు ఎన్నికలు వస్తే మనకు మరీ మంచిది
  • ఎన్నికలకు అందరూ సన్నద్ధం కావాలి
  • ఎన్నికల వరకు ప్రతి క్షణం కూడా విలువైనదే

ఏపీలోని 175 నియోజకవర్గాల్లో పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలంటూ పార్టీ శ్రేణులకు వైసీపీ అధినేత జగన్ దిశానిర్దేశం చేశారు. 2018 అక్టోబర్ లోనే ఎన్నికలు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారని... తన వద్ద ఉన్న సమాచారం కూడా అదేనని ఆయన అన్నారు. అక్టోబర్ లోనే ఎన్నికలు వస్తే మనకు మరీ మంచిదని... ఒకవేళ కొంచెం ఆలస్యమైనా ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు.

ఎన్నికలకు పార్టీ క్యాడర్ మొత్తం సర్వసన్నద్ధంగా ఉండాలని... ఎలెక్షన్లు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. రెండో తేదీన పాదయాత్ర మొదలవబోతోందని... పాదయాత్ర కొనసాగే జిల్లాలలో పార్టీ నేతలంతా సమష్టిగా పాల్గొనాలని సూచించారు. ఇదే సమయంలో మిగిలిన జిల్లాల్లో సమాంతర కార్యక్రమాలను చేపట్టాలని చెప్పారు. ఎన్నికల వరకు ప్రతి క్షణం కూడా ఎంతో విలువైనదని... ప్రజాస్వామ్య యుద్ధానికి అందరూ సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. 

  • Loading...

More Telugu News