cricket: ఓపక్క వర్షం అంటున్నారు.. మరి, రేపు మ్యాచ్ జరుగుతుందా?

  • ఉప్పల్ స్టేడియంలో రేపు చివరి టీ20 మ్యాచ్
  • రానున్న రెండు రోజుల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ
  • మ్యాచ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి.. వాతావరణం అనుకూలిస్తే హోరాహోరీ మ్యాచ్

ఆస్ట్రేలియా-భారత జట్ల మధ్య చివరి టీ20 మ్యాచ్ రేపు సాయంత్రం హైదరాబాదులోని ఉప్పల్ లో గల రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. హైదరాబాదును గత వారం రోజులుగా ఏదో ఒక సమయంలో వర్షాలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. రానున్న రెండు రోజులపాటు హైదరాబాదులో వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తాజాగా ప్రకటన చేసింది.

ఈ నేపథ్యంలో ఫలితం తేలాల్సిన చివరి టీ20 మ్యాచ్ జరగడం సందేహాస్పదమేనని అంటున్నారు. ఈ మ్యాచ్ కోసం హైదరాబాదీ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టికెట్లు ఇప్పటికే అమ్ముడైపోయాయి. అయితే స్టేడియంలో అత్యుత్తమ డ్రైనేజీ సిస్టమ్ ఉందని, భారీ వర్షం కురిస్తే చేయగలిగేది లేదు కానీ ఓ మోస్తరు వర్షం వల్ల మ్యాచ్ ఆగదని క్యూరేటర్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రేపటి మ్యాచ్ కు హైదరాబాదు క్రికెట్ అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. 

More Telugu News