trumph: ట్రంప్ తన పతనాన్ని తానే కొనితెచ్చుకుంటున్నారు: రిపబ్లికన్ సెనెటర్

  • వైట్ హౌస్ లో రెండు రోజులుగా రియాలిటీ షో
  • తన స్థాయిని తానే దిగజార్చుకుంటున్న ట్రంప్
  • కీలక బాధ్యతల్లో ఉన్న అధికారిని ఆయన ఎలా దూషిస్తారు?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరుపై రిపబ్లికన్ పార్టీ సెనేటర్ ఒకరు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ తన పతనాన్ని తానే కొనితెచ్చుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఉత్తరకొరియాతో జరుగుతున్న మాటల యుద్ధంతో పాటు, లాస్ వెగాస్ కాల్పులు, ఫ్లోరిడా తుపాన్ బాధితులను ఆదుకోవడం విషయంలో ట్రంప్ తీరు దారుణంగా ఉందని ఆయన మండిపడ్డారు.

గత రెండు రోజులుగా వైట్ హౌస్ లో రియాలిటీ షో జరుగుతోందని ఆయన మండిపడ్డారు. జాతీయ భద్రత కార్యదర్శిగా పనిచేస్తున్న రెక్స్ టెల్లర్సన్‌ ను ఐక్యూ టెస్ట్ కు సిద్ధంగా ఉండాలనడాన్ని ఆయన ఖండించారు. ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారిని ఆయన ఎలా దూషిస్తారని ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలతో ట్రంప్ తన స్థాయిని దిగజార్చుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఉత్తరకొరియాతో చర్చలు జరుపుదామన్న టెల్లర్సన్ సూచనను తిరస్కరించడం ట్రంప్ అవివేకానికి నిదర్శనమని ఆయన చెప్పారు.
trumph
senator
comments

More Telugu News