హైదరాబాద్: హైదరాబాద్‌లో థియేటర్లు, బస్టాండ్లు, షాపింగ్ మాల్స్‌ వద్ద ఆంక్షలు

  • జనం గుమిగూడి క‌నిపిస్తే తక్షణమే ప్రత్యేక చర్యలు
  • జ‌నం ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో క్యూ ప‌ద్ధ‌తి పాటించాలి
  • హైద‌రాబాద్ పోలీస్ క‌మీష‌న‌ర్ మ‌హేంద‌ర్ రెడ్డి ప్రకటన

హైదరాబాద్‌లోని థియేటర్లు, బస్టాండ్లు, షాపింగ్ మాల్స్‌, కాలేజీలు, వైన్ షాపులు, హోట‌ళ్ల వంటి ప్రాంతాల్లో 15 రోజుల పాటు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని హైదరాబాద్‌ పోలీసులు ప్ర‌క‌ట‌న చేశారు. ఒక్క‌సారిగా ఈ ఆంక్ష‌లు ఎందుకు విధించార‌న్న అంశంపై స్ప‌ష్ట‌త రాలేదు. ఒక‌వేళ‌ జనం గుమిగూడి క‌నిపిస్తే తక్షణమే ప్రత్యేక చర్యలు తీసుకుంటామ‌ని హైద‌రాబాద్ పోలీస్ క‌మీష‌న‌ర్ మ‌హేంద‌ర్ రెడ్డి తెలిపారు. జ‌నం ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో క్యూ ప‌ద్ధ‌తి పాటించాల‌ని అన్నారు.

More Telugu News