sushanth: 'ప్లీజ్ రిప్లై ఇవ్వండి' అంటూ న‌టుడు సుశాంత్ బొమ్మ‌ను గీసి పోస్ట్ చేసిన అమ్మాయి.. స్పందించిన హీరో!

  • ‘ఇది మీ కోస‌మే గీశాను.. ఇది మీపై నాకున్న ప్రేమ‌’ అని తెలిపిన అభిమాని
  • ‘థ్యాంక్యూ సో మచ్ ప్రియా’ అని రిప్లై ఇచ్చిన సుశాంత్
  • ప్రస్తుతం ‘చి.ల.సౌ’ సినిమాలో నటిస్తోన్న సుశాంత్

యువ నటుడు సుశాంత్‌కి ఓ అమ్మాయి ఈ రోజు ట్విట్ట‌ర్ ద్వారా ఓ గిఫ్ట్ పంపింది. సుశాంత్ చిత్రాన్ని స్వ‌యంగా గీసి పోస్ట్ చేసింది. ‘హ‌ల్లో స‌ర్‌.. ఇది మీ కోస‌మే గీశాను.. ఇది మీపై నాకున్న ప్రేమ‌.. ప్లీజ్ ఇది మీకు న‌చ్చిందో లేదో చెప్పండి’ అంటూ ప్రియ శ‌ర్మ అనే ఓ అమ్మాయి పేర్కొంది. దీనిపై స్పందించిన సుశాంత్ ఈ చిత్రాన్ని రీ ట్వీట్ చేశాడు. ‘థ్యాంక్యూ సో మచ్ ప్రియా’ అని నవ్వుతోన్న ఎమోజీని పెట్టాడు. కాగా, ప్రస్తుతం రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘చి.ల.సౌ’ అనే సినిమాలో సుశాంత్ నటిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు.

 

  • Loading...

More Telugu News