raju gari gadi 2: `రాజుగారి గది 2`లో సమంత, నాగార్జునల పేర్లివే!

  • మెంటలిస్ట్ రుద్ర పాత్రలో నాగార్జున‌
  • అమృత‌గా స‌మంత
  • 13న విడుద‌ల కానున్న చిత్రం

మామ నాగార్జున‌, కోడ‌లు స‌మంత కీల‌క పాత్రల్లో తెర‌కెక్కించిన `రాజుగారి గ‌ది 2` చిత్రంలో వీళ్లిద్ద‌రి పాత్ర‌లు పేర్లేంట‌నే ఆస‌క్తి అభిమానుల్లో క‌నిపిస్తుంది. ఇందులో మెంట‌లిస్ట్‌గా న‌టిస్తున్న నాగార్జున పాత్ర పేరు `రుద్ర‌`, అలాగే దెయ్యం పాత్ర‌లో న‌టిస్తున్న‌ స‌మంత పేరు `అమృత‌`గా తెలుస్తోంది. ఈ శుక్ర‌వారం విడుద‌ల కాబోతున్న ఈ చిత్రంపై ఇప్ప‌టికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో నాగార్జున‌, స‌మంతల పాత్ర‌లు హైలైట్‌గా నిలుస్తాయ‌ని చిత్ర నిర్మాత ఓంకార్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఇంకా ఈ చిత్రంలో వెన్నెల కిషోర్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, అశ్విన్‌, శీర‌త్ క‌పూర్‌లు న‌టించారు.

More Telugu News