సొంత తమ్ముడి కేసు విచారణ... సీబీఐ 'ఫైనాన్షియల్ ఫ్రాడ్' బాస్ ను తప్పించిన డైరెక్టర్!
- బ్యాంకింగ్ మోసాలను విచారిస్తున్న రాజీవ్ సింగ్
- అలహాబాద్ బ్యాంకు నుంచి ఫిర్యాదు
- సోదరుడు సంజీవ్ ను విచారించాల్సిన పరిస్థితి
- కేసు నుంచి పక్కకు తప్పించిన సీబీఐ
ఈ సమయంలో అలహాబాద్ బ్యాంకులోని ఓ శాఖలో రూ. 6 కోట్ల మేరకు మోసం జరిగిందని ఫిర్యాదు వచ్చింది. ఈ ఫిర్యాదులో భాగంగా సంజీవ్ సింగ్ అనే వ్యక్తి, తనకు లేని ఆస్తిని చూపించి రుణం తీసుకున్నాడన్న ఫిర్యాదు సీబీఐకి రాగా, ఈ సంజీవ్, స్వయానా రాజీవ్ సింగ్ కు తమ్ముడేనని తేలింది. సోదరుడిపై పక్షపాతం చూపుతాడని కాకున్నా, నిబంధనల మేరకు సీబీఐ డైరెక్టర్ అనిల్ సిన్హా, ఈ విభాగం నుంచి రాజీవ్ సింగ్ ను పక్కకు తప్పించారు. ఈ కేసు విచారణకు రాజీవ్ సింగ్ నేతృత్వం వహించడం లేదని సీబీఐ ఓ ప్రకటనలో తెలిపింది.