kathi mahesh: ఆ సమయంలో ఆర్ధికంగా ఇబ్బందులు పడ్డాను : కత్తి మహేశ్

  • ఈ మధ్య కాలంలో పాప్యులర్ అయిన కత్తి మహేశ్
  • సినిమాలంటే చిన్నప్పటి నుంచి ఇష్టం
  • సినిమాల్లోనే ఏదో ఒకటి చేయాలనే తపన
  • టీవీ రంగానికి వెళితే కలిగిన అసంతృప్తి  

'బిగ్ బాస్' షోలో పాల్గొనడం వలన .. పవన్ కల్యాణ్ కి సంబంధించి చేసిన కొన్ని వ్యాఖ్యల వలన కత్తి మహేశ్ అందరి దృష్టిలో పడ్డారు. సింపుల్ గా కనిపిస్తూ .. పదునైన పదజాలం వాడే కత్తి మహేశ్, తాజాగా ఐడ్రీమ్స్ తో తనకి సంబంధించిన విషయాలను పంచుకున్నారు. చిత్తూరు జిల్లా 'పీలేరు' గ్రామానికి చెందిన తాను .. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చానని ఆయన అన్నారు. చిన్నప్పటి నుంచి సినిమాలు ఎక్కువగా చూసేవాడిననీ .. సినిమా రంగానికి వెళ్లి ఏదైనా ఒకటి చేయాలనే ఆలోచన ఉండేదని చెప్పారు.

 మాస్ కమ్యూనికేషన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తాను, ముందుగా టీవీ రంగానికి వెళ్లానని అన్నారు. గతంలో రాఘవేంద్రరావు ప్రొడక్షన్ లో రూపొందిన 'రాఘవేంద్రస్వామి మహాత్మ్యం' సీరియల్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా కొంతకాలం పనిచేశానని చెప్పారు. అయితే జీతం తక్కువగా ఉండటం వలన .. చాలక ఇబ్బందులు పడ్డాననీ, ఇంటి నుంచి డబ్బులు తెప్పించుకునేవాడినని అన్నారు. కుటుంబానికి అండగా నిలవాల్సిన తాను .. వాళ్ల నుంచి డబ్బులు తెప్పించుకోవడం ఇష్టం లేక, తిరిగి తన ఊరు వెళ్లిపోయానని చెప్పారు.     

More Telugu News