Roja: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌’లో వర్మ ఆఫర్‌పై స్పందించిన రోజా!

  • వర్మ వ్యాఖ్యలపై సానుకూల స్పందన
  • మంచి పాత్ర ఇస్తే నటిస్తానన్న వైసీపీ ఎమ్మెల్యే
  • ఏ పాత్రకు ఎంపిక చేస్తారో తెలియదన్న నటి
ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ త్వరలో తెరకెక్కించనున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో తాను నటించనున్నట్టు వస్తున్న వార్తపై వైసీపీ ఎమ్మెల్యే, నటి రోజా స్పందించారు. మంచి పాత్ర ఇస్తే చేసేందుకు సిద్ధమని పేర్కొన్నారు. అయితే వర్మ తనను ఏ పాత్ర కోసం ఎంపిక చేసుకోవాలనుకుంటున్నారో తనకు తెలియదన్నారు. ఆయనను కలిసిన తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు.

రాంగోపాల్ వర్మ మంగళవారం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను నిర్మించనున్న వైసీపీ నేత రాకేష్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమాలోని పాత్రల కోసం ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదని పేర్కొన్నారు. వైసీపీ ఎమ్మెల్యే  రోజాకు కూడా ఇందులో మంచి పాత్ర ఉంటుందని చెప్పారు. వర్మ వ్యాఖ్యలపై సానుకూలంగా స్పందించిన రోజా మంచి పాత్ర ఇస్తే తప్పకుండా నటిస్తానని స్పష్టం చేశారు.
 
 
Roja
Actress laxmi's Ntr
Rgv
movie

More Telugu News