geetamadhuri: నటన వైపు వెళ్లాలనే ఆసక్తి లేదు .. సింగర్ గా కొనసాగడమే ఇష్టం : గీతామాధురి

  • సింగర్ గా గీతామాధురికి విపరీతమైన క్రేజ్
  • నటన వైపు వెళ్లాలని ఉందా? అంటూ సంగీత దర్శకుడు కోటి ప్రశ్న
  • అలాంటి ఆలోచన లేదని గీతామాధురి సమాధానం

తెలుగు పాటను పరుగులు తీయిస్తోన్న సింగర్స్ లో గీతామాధురి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆమె వాయిస్ లోని ప్రత్యేకతను చాలామంది శ్రోతలు ఇష్టపడతారు. ఓ గాయనిగా ఆమెను అభిమానించేవారి సంఖ్య ఎక్కువే. అలాంటి గీతామాధురి తాజాగా ఐ డ్రీమ్స్ తో తన కెరియర్ కి సంబంధించిన విశేషాలను పంచుకుంది.

ఈ సందర్భంలోనే .. "గాయనిగా మాత్రమే కెరియర్ ను కొనసాగించాలని ఉందా? లేదంటే హీరోయిన్ గా గానీ .. కేరక్టర్ ఆర్టిస్ట్ గా గానీ కెరియర్ ను మార్చుకోవాలనే ఆలోచనేమైనా ఉందా?" అంటూ సంగీత దర్శకుడు కోటి .. వీడియో ద్వారా ఆమెను ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు ఆమె తనదైన శైలిలో స్పందించింది. తనపై కోటి గారికి గల అభిమానానికి థ్యాంక్స్ చెప్పింది. నటించాలనే సరదాను తాను ఓ షార్ట్ ఫిల్మ్ ద్వారా తీర్చేసుకున్నానని అంది. ఇక నటన వైపు తన దృష్టి లేదనీ .. సింగర్ గానే కొనసాగుతానని చెప్పింది. ఒకవేళ ఏదైనా అద్భుతం జరిగితే ఇతర భాషల్లో చేస్తానేమో గానీ, తెలుగులో తనని తాను ఒక నటిగా చూసుకోవాలని లేదని స్పష్టం చేసింది.       

  • Loading...

More Telugu News