ohmkar: తండ్రి కోరిక కాదనలేదు .. నేను ఎంచుకున్న మార్గాన్ని వదిలిపెట్టలేదు: దర్శకుడు ఓంకార్

  • అసిస్టెంట్ డైరెక్టర్ గా కొన్ని రోజుల ప్రయాణమే
  • అక్కడి ట్రీట్ మెంట్ ఎంతమాత్రం నచ్చలేదు
  • యాంకరింగ్ ద్వారా జనంలోకి
  • గుర్తింపు వచ్చాక పట్టిన మెగాఫోన్      

ఓంకార్ దర్శకత్వంలో రూపొందిన 'రాజుగారి గది 2' విడుదల తేదీ సమయం దగ్గర పడుతుండటంతో, ప్రమోషన్స్ లో ఆయన బిజీగా వున్నాడు. ఈ నేపథ్యంలో 'ఐ డ్రీమ్స్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, సినిమా దర్శకుడు కావాలనే ఒక ఆశయంతోనే తన ప్రయాణం ప్రారంభమైందని చెప్పారు. తన తండ్రి డాక్టర్ కావడం వలన తనని కూడా డాక్టర్ చేయాలనేది ఆయన కోరికని అన్నారు. ఆయన మనసును బాధ పెట్టడం ఇష్టం లేక 'ఫిజియో థెరపీ' వైపు వెళ్లానని చెప్పారు.

అది పూర్తయిన తరువాత తండ్రితో తన మనసులోని మాట చెప్పి, ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశానని అన్నారు. అయితే అక్కడి ట్రీట్ మెంట్ .. వాతావరణం నచ్చక మానేశానని చెప్పారు. యాంకర్ గా మీడియాకు .. ప్రేక్షకులకు చేరువై, అటు నుంచి డైరెక్షన్ వైపు వెళ్లాలనే ఆలోచన వచ్చిందని అన్నారు. అలా 'ఇన్ కేబుల్' లో యాంకర్ గా కెరియర్ మొదలైందనీ .. ఆ తరువాత టీవీ చానల్స్ లో చేసిన గేమ్ షోలు పేరు తెచ్చిపెట్టాయని చెప్పారు. ఆ తరువాత తనపై తనకి మరింత నమ్మకం ఏర్పడటంతో దర్శకుడిగా రంగంలోకి దిగానని అన్నారు. అలా తాను అనుకున్నది సాధించగలిగానని చెప్పుకొచ్చారు.      

More Telugu News