harbhajan singh: భార్యకు శుభాకాంక్షలు చెప్పిన హర్భజన్... నెటిజన్ల విమర్శలు.. ఘాటు సమాధానం!

  • కర్వాచౌత్ ఆచరించిన హర్భజన్ భార్య గీతా బాస్రా
  • కర్వాచౌత్ శుభాకాంక్షలు తెలిపిన హర్భజన్
  • మూఢ నమ్మకాలు ప్రోత్సహించ వద్దంటూ భజ్జీకి సలహాలు  
టీమిండియా మాజీ బౌలర్ హర్భజన్ సింగ్ తన భార్యనుద్దేశించి సోషల్ మీడియాలో చేసిన పోస్టు వివాదాస్పదమైంది. దాని వివరాల్లోకి వెళ్తే... కర్వాచౌత్ సందర్భంగా భజ్జీ... 'కర్వాచౌత్ శుభాకాంక్షలు భార్యామణీ! బోల్డంత ప్రేమ, ముద్దులు... నీకు బాగా ఆకలేస్తుంటుందని నాకు తెలుసు. ఇక తిను, తాగు, సంతోషంగా గడుపు' అంటూ భార్యకు ట్వీట్ చేశాడు.

దీనిపై పలువురు అభ్యంతరం చెప్పారు. 'సిక్కువేనా నువ్వు?' అని అడిగారు. సిక్కులు ఉపవాసం లాంటి అంధవిశ్వాసాన్ని నమ్మరని తెలిపారు. ఇలాంటి ట్వీట్లు ఎక్కువ కావడంతో మరోసారి స్పందించిన భజ్జీ.. ఇలా చెయ్యొద్దని ఏ గ్రంధంలో ఉంది? అని ప్రశ్నించాడు. 'ధర్మం పేరుతో అడ్డగోలు వాదనలు మాని, మంచి మనుషుల్లా ఉండండి' అంటూ సూచించాడు. 
harbhajan singh
geeta basra
karwachouth

More Telugu News