actress trisha: నెట్టింట హల్ చల్ చేస్తున్న త్రిష సెల్ఫీ!

  • 34 ఏళ్ల వయసులోనూ చెదరని అందం
  • కొత్త సినిమా కోసం జిమ్ లో వర్కౌట్లు
  • వైరల్ అవుతున్న ఫొటో
సినీ రంగంలోకి అడుగుపెట్టి ఒకటిన్నర దశాబ్దం కావస్తున్నా నటి త్రిష గ్లామర్ మాత్రం తగ్గలేదు. ఫిట్ నెస్ కు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే త్రిష... ఇప్పుడు మరింత నాజూకుగా మారింది. 34 ఏళ్ల వయసులో కూడా టీనేజ్ అమ్మాయిలా కనిపిస్తూ... ఔరా అనిపిస్తోంది. తాజాగా, తమిళంలో 'గర్జనై' అనే చిత్రంలో ఆమె లేడీ ఓరియెంటెడ్ పాత్రను చేస్తోంది. మరి కొన్ని చిత్రాలు కూడా ఈ చెన్నై బ్యూటీ చేతిలో ఉన్నాయి. 'గర్జనై' సినిమా కోసం ఆమె జిమ్ లో ప్రతి రోజూ వర్కౌట్లు చేస్తోంది. ఈ సందర్భంగా జిమ్ లో ఉన్న సమయంలో త్రిష ఓ సెల్ఫీ తీసుకుని, సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. ఇప్పుడు ఈ ఫొటో వైరల్ అవుతోంది. 
actress trisha
trisha krishnana
trisha selfie

More Telugu News