ohmkar: ఎవరైనా విమర్శిస్తే.. స్పందించను.. మౌనంగా వుండిపోతా!: దర్శకుడు ఓంకార్

  • కెరియర్ పరంగా ఒడిదుడుకులు
  • నవ్వుతూనే ముందడుగులు
  • సహనమే తన ఆయుధం
  • అదే సమస్యలకి పరిష్కారం  
బుల్లితెరపై యాంకర్ గా రాణించిన ఓంకార్ .. వెండితెరపై దర్శకుడిగా కూడా తానేమిటన్నది నిరూపించుకున్నారు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'రాజుగారి గది 2' ఈ నెల 13వ తేదీన విడుదలవుతోంది. నాగార్జున .. సమంత .. శీరత్ కపూర్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా గురించిన విశేషాలను ఆయన 'ఐ డ్రీమ్స్'తో పంచుకున్నారు.

బుల్లితెరకి సంబంధించిన కెరియర్ పరంగాను .. వెండితెరకి సంబంధించిన కెరియర్ పరంగాను తాను చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని చెప్పారు. తన మనసుకు కష్టం కలిగించే సంఘటనలు జరిగినప్పుడు, కల్మషం లేని వాతావరణంలో ఉండటానికి ఇష్టపడతానని అన్నారు. చిన్నపిల్లలతో .. కుక్కపిల్లలతో ఆడుతూ ఊరట పొందుతానని చెప్పారు. ఇక ఎవరైనా తనపై విమర్శలు చేసినా .. వెంటనే తాను రియాక్ట్ కాననీ, మౌనంగా .. ఒంటరిగా ఉండిపోతానని అన్నారు. సహనమే సమస్యలను పరిష్కరిస్తుందనేది తాను నమ్మిన సూత్రమనీ, దానిని ఆచరిస్తూ వివాదాలకు దూరంగా ఉంటానని చెప్పుకొచ్చారు.  
ohmkar

More Telugu News