travencore endoment: ఆల‌య పూజారిగా ద‌ళిత‌ వ్య‌క్తి .... నియ‌మించిన‌ ట్రావెన్‌కోర్ దేవాల‌య మండ‌లి

  • బాధ్య‌త‌లు స్వీక‌రించిన యేదు కృష్ణ‌న్‌
  • 36 మంది బ్రాహ్మ‌ణేత‌రులకు అర్చ‌క బాధ్య‌త‌లు
  • అందులో ఆరుగురు ద‌ళితులు

హిందూ దేవాల‌యంలో బ్రాహ్మ‌ణులే అర్చ‌కులుగా పూజ‌లు నిర్వ‌హించాల‌నే సంప్ర‌దాయానికి కేర‌ళ‌లోని ట్రావెన్‌కోర్ దేవాల‌య మండ‌లి స్వ‌స్తి ప‌లికింది. 1936 నవంబరు 12న ట్రావన్‌కోర్‌ సంస్థానం నిమ్నకులాల వారికి ఆలయ ప్రవేశ అర్హతను కల్పిస్తూ చేసిన శాస‌నాన్ని 81 ఏళ్ల త‌ర్వాత అమ‌లు చేసింది. ఇటీవ‌ల 36 మంది బ్రాహ్మ‌ణేత‌రుల‌ను పూజారులుగా ఎంపిక చేసి, వారికి అర్చ‌క బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించింది. వారిలో ఆరుగురు ద‌ళితులు.

 ఆ ద‌ళితుల్లో ఒక‌రైన యేదు కృష్ణ‌న్ సోమ‌వారం తిరువ‌ళ్ల‌కు స‌మీపంలోని మ‌ణ‌ప్పురం శివాల‌య అర్చ‌కునిగా బాధ్య‌త‌లు స్వీక‌రించి కేర‌ళ‌లో తొలి ద‌ళిత పూజారిగా చ‌రిత్ర సృష్టించారు. సంస్కృతంలో స్నాతకోత్తర (పీజీ) విద్యను అభ్యసిస్తున్న యేదు కృష్ణన్‌ గత పదేళ్లుగా పూజాక్రతువులను నేర్చుకున్నారు. తన గురువు అయిన కేకే అనిరుద్ధన్‌ తంత్రి నుంచి ఆశీర్వాదం పొందిన అనంతరం ప్రధాన అర్చకులు గోపకుమార్‌ నంబూద్రి మంత్రోచ్చారణల మధ్య కృష్ణన్‌ ఆలయ ప్రవేశం చేశారు.

More Telugu News