harassment: 'ఆ ఎస్సై లాడ్జికి రమ్మంటున్నాడు... చావే నాకు శరణ్యం' అంటున్న మహిళ!

  • నీ భర్తను కేసు నుంచి తప్పించాలంటే లాడ్జికి రావాల్సిందేనన్న నూజివీడు ఎస్సై వెంకట్ కుమార్
  • తానలాంటి దానిని కాదని వేడుకున్నా కనికరించని ఎస్సై
  • ఫోన్ రికార్డులతో ఉన్నతాధికారులను ఆశ్రయించిన బాధితురాలు

కృష్ణా జిల్లా నూజివీడు ఎస్సై వెంకట్ కుమార్ వేధింపులు భరించలేకపోతున్నానని ఒక మహిళ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే... ప్రభుత్వోద్యోగి భార్య అయిన బాధిత మహిళ ఒక ప్రైవేటు స్కూల్ లో టీచర్ గా పని చేస్తోంది... భర్త కేసు విషయంలో నూజివీడు పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. ఆ సమయంలో ఎస్సై వెంకట్ కుమార్ బాధితురాలిని చూశాడు. అప్పటి నుంచి ఆమెపై వేధింపులు మొదలయ్యాయి.

తనతో గడిపితే ఆమె భర్తను కేసు నుంచి తప్పిస్తానని ఎస్సై వెంకట్ కుమార్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. తాను అలాంటి వ్యక్తిని కాదని, తనను వేధించవద్దని ఆమె ఎంత వేడుకున్నా ఎస్సై మాత్రం... కేసు నుంచి తప్పించాలంటే లాడ్జీకి రావాల్సిందేనని, తనతో గడపాల్సిందేనని స్పష్టం చేశాడు.

దీంతో అతని ఫోన్ వేధింపులను రికార్డు చేసిన బాధితురాలు, ఆ రికార్డులను జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు వినిపించింది. అతని వేధింపులు భరించలేకపోతున్నానని, చావే తనకు శరణ్యమని స్పష్టం చేసింది. దీంతో ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అతనిపై క్రమశిక్షణాచర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. 

More Telugu News