srinu vaitla: ఆసక్తిని రేకెత్తిస్తోన్న కొత్త చిత్రాల టైటిల్స్!

  •  పవన్ మూవీకి 'అజ్ఞాతవాసి' టైటిల్ ఫిక్స్
  •  వరుణ్ తేజ్ మూవీ టైటిల్ గా 'తొలిప్రేమ' ఖరారు
  •  హరీశ్ శంకర్ నెక్స్ట్ మూవీ టైటిల్ 'దాగుడు మూతలు'
  • 'అమర్ అక్బర్ ఆంటోని' టైటిల్ రవితేజ కోసమంటూ టాక్        

తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి ఎప్పటిలానే కొత్తగా కొన్ని సినిమాలు ముస్తాబవుతున్నాయి. ఆ సినిమాల కోసం రిజిస్టర్ చేయించిన టైటిల్స్ ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. త్రివిక్రమ్ - పవన్ కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమాకి సంబంధించి 'అజ్ఞాతవాసి' అనే టైటిల్ వైపు టీమ్ మొగ్గు చూపుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. రీసెంట్ గా దర్శక నిర్మాతలు ఇదే టైటిల్ ను రిజిస్టర్ చేయించారు.

 ఇక వరుణ్ తేజ్ .. రాశిఖన్నా కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమాకి బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి 'తొలి ప్రేమ' అనే టైటిల్ పెట్టే ఆలోచనలో వున్నట్టుగా ప్రచారం జరిగింది. తాజాగా అదే టైటిల్ ను రిజిస్టర్ చేయించారు.

హరీశ్ శంకర్ కూడా దిల్ రాజు నిర్మాణంలో చేయనున్న తన తదుపరి సినిమా కోసం 'దాగుడు మూతలు' టైటిల్ ను రిజిస్టర్ చేయించాడు. ఇక మైత్రీ మూవీస్ వారు 'అమర్ అక్బర్ ఆంటోని' టైటిల్ ను రిజిస్టర్ చేయించారు. శ్రీను వైట్ల - రవితేజ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా కోసమే ఈ టైటిల్ అంటూ చెప్పుకుంటున్నారు.      

More Telugu News