raghuveera reddy: ప్రత్యేక హోదా ఇవ్వలేమని స్పష్టంగా చెప్పిన బీజేపీకి ఎందుకు మద్దతిచ్చారు?: జగన్ పై మండిపడ్డ రఘువీరా

  • జగన్ మోదీకి లొంగిపోయారు
  • ఎంపీలతో రాజీనామాలు ఎందుకు చేయించలేదు
  • ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ పాత్ర ఏంటి
వైసీపీ అధినేత జగన్ పై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని బీజేపీ స్పష్టంగా చెప్పిందని... అయినా, రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి ఎందుకు మద్దతిచ్చారని ఆయన ప్రశ్నించారు. స్పెషల్ స్టేటస్ విషయంలో వైసీపీ పాత్ర ఏంటో జగన్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. లౌక్యమా, దౌత్యమా, పోరాటమా అనే విషయాన్ని చెప్పాలని అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే వైసీపీ ఎంపీలంతా జూన్ నెలలో రాజీనామాలు చేస్తారని అప్పట్లో జగన్ ప్రకటించారని... మరి ఇంతవరకు రాజీనామాలు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ప్రధాని మోదీకి జగన్ లొంగిపోయారని ఎద్దేవా చేశారు. 
raghuveera reddy
apcc
ys jagan
ysrcp
speacial status to ap

More Telugu News