ntr: 'జనతా గ్యారేజ్' రికార్డును అధిగమించిన 'జై లవకుశ' .. తదుపరి టార్గెట్ ఆ చిత్రాలే!

  • కొనసాగుతోన్న 'జై లవకుశ' జోరు
  • పెరుగుతోన్న వసూళ్లు
  • కొల్లగొడుతోన్న రికార్డులు
  • అభిమానుల్లో సంతోషం    

ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన 'జై లవ కుశ' .. దసరా పండుగకి ముందుగా రంగంలోకి దిగి చేస్తోన్న సందడి అంతా ఇంతా కాదు. విడుదలైన ప్రతి ప్రాంతంలోను ఈ సినిమా విజయవిహారం చేస్తోంది. ఈ సినిమా విడుదలైన 18 రోజుల్లో 140 కోట్ల గ్రాస్ ను సాధించినట్టు సమాచారం. గతంలో ఎన్టీఆర్ చేసిన 'జనతా గ్యారేజ్' 134 కోట్ల వరకూ రాబట్టి, ఎన్టీఆర్ కెరియర్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. తాజాగా ఆ రికార్డును 'జై లవ కుశ' అధిగమించింది.

 ఇక వసూళ్ల పరంగా ఈ సినిమాకి ముందు స్థానాల్లో 'ఖైదీ నెంబర్ 150' .. 'శ్రీమంతుడు' సినిమాలు వున్నాయి. 164 కోట్లను రాబట్టి మొదటి స్థానంలో 'ఖైదీ నెంబర్ 150' .. 156 కోట్లను సాధించి రెండవ స్థానంలో 'శ్రీమంతుడు' వున్నాయి. 'జై లవ కుశ' ఇదే దూకుడును కొనసాగిస్తే, ఆ రికార్డులను అధిగమించే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.  

  • Loading...

More Telugu News