viral video: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వైజాగ్ కానిస్టేబుల్ విన్యాసం...వీడియో చూడండి, నవ్వాపుకోలేరు!

  • గాంధీ జయంతి సందర్భంగా రోల్ కాల్ నిర్వహించిన వైజాగ్ గంట్యాడ ఫైర్ సిబ్బంది
  • రోల్ కాల్ కు పూటుగా తాగి వచ్చిన కానిస్టేబుల్ మంగరాజు
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మంగరాజు వీడియో
గాంధీ జయంతి సందర్భంగా విశాఖపట్టణంలోని గంట్యాడ అగ్నిమాపక సిబ్బంది చేసిన విన్యాసం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. గాంధీ జయంతిని పురస్కరించుకుని ఉన్నతాధికారులు రానున్నారంటూ గంట్యాడ అగ్నిమాపక కార్యాలయ సిబ్బందిని అధికారులు అప్రమత్తం చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రోల్ కాల్ లో మంగరాజు చేసిన డ్రిల్ చూసినవారు నవ్వాపుకోలేకపోతున్నారు. అప్పటికే పూటుగా తాగి వచ్చిన మంగరాజు లైన్ లో నిల్చునేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. అంతేకాక, ఉన్నతాధికారి ఇచ్చిన సూచనలు పాటించడంలో పూర్తిగా విఫలమయ్యాడు.

ఒక దశలో కాళ్లు తొట్రుపడడంతో పక్కలైన్లో నిల్చున్న సహోద్యోగిపై పడబోయాడు. మరోసారి ఏకంగా సూచనలిస్తున్న పైఉద్యోగిపై పడబోయాడు. గుండ్రంగా తిరిగి తమాయించుకోలేక పక్కనే పార్క్ చేసి వున్న టూవీలర్ పై పడిపోయాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను మీరు కూడా చూడండి.. నవ్వాపుకోవడం కష్టమే.

viral video
social media
fire constable
vizag

More Telugu News