kim jong un: రెండుకాళ్లు పైకెత్తి, చేతులను నేలకు ఆనించి గిరగిరా తిరుగుతూ.. అబ్బురపరుస్తున్న కిమ్ జాంగ్ విన్యాసాలు.. వీడియో చూడండి

  • వైరల్ గా మారిన కిమ్ జాంగ్ వీడియో
  • ఫిట్ నెస్ విషయంలో రాజీ పడని నియంత
  • బాస్కెట్ బాల్, సంగీతం అంటే కిమ్ కు చాలా ఇష్టం
ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ అంటే బొద్దుగా ఉన్న శరీరాకృతి, విచిత్రమైన హెయిల్ స్టైల్ గుర్తుకు వస్తాయి. వరుస క్షిపణి, అణు పరీక్షలతో అమెరికాకు నిద్ర లేకుండా చేస్తున్న కిమ్... కరుడుగట్టిన నియంత్ర మాత్రమే కాదు, మంచి బాస్కెట్ బాల్ క్రీడాకారుడు కూడా. సంగీతమంటే చెవులు కోసుకుంటారు. సంగీతంపై ఉన్న మక్కువతోనే గాయని రిసోల్ జుని పెళ్లాడారు. భోజనం పట్ల మక్కువతో కిమ్ జాంగ్ బొద్దుగా తయారయ్యారట. అయినా కూడా ఫిట్ నెస్ విషయంలో ఆయన ఏమాత్రం రాజీ పడరని ఆయన సన్నిహితులు చెబుతారు.

తాజాగా ఆయన చేసిన విన్యాసాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వీడియోను ఎవరు, ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారో తెలియనప్పటికీ... ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. రెండు కాళ్లు పైకెత్తి, చేతులను నేలకు తాకిస్తూ, గిరగిరా తిరుగుతున్న కిమ్ చూసి, అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ వీడియోను మీరూ చూడండి.
kim jong un
north korea
kim jong un fitness video

More Telugu News