kamal hasan: కమలహాసన్ ముఖ్యమంత్రి కాలేడు!: సంచలన వ్యాఖ్యలు చేసిన సోదరుడు చారుహాసన్

  • ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కమల్ కు లేవు 
  • ఆయనకు అధికారం దక్కదు
  • రజనీకాంత్ రాజకీయాల్లోకే రారన్న చారుహాసన్
ఓవైపు దక్షిణాది నట దిగ్గజం కమలహాసన్ రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్న వేళ, ఆయన సోదరుడు, జాతీయ ఉత్తమ నటుడు చారుహాసన్‌ సంచనల వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రైవేటు చానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ, కమలహాసన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎంతమాత్రమూ లేవని, ఆయనకు అధికారం దక్కదని అన్నారు.

ఇక రజనీకాంత్ పేరును ప్రస్తావిస్తూ, ఆయనసలు రాజకీయాల్లోకే రాబోరని అభిప్రాయపడ్డారు. ఇక ప్రస్తుతం ఉన్న నేతల్లో సీఎం కాగల అవకాశం ఎవరికి ఉందన్న ప్రశ్నకు కేంద్ర మాజీ మంత్రి, పీఎంకే యూత్ వింగ్ ప్రెసిడెంట్ అన్భుమణి రాందాస్ పేరు చెప్పారు. వచ్చే నెల 7వ తేదీన కమలహాసన్ తన పార్టీ పేరు, జెండా, అజెండాలను ప్రకటిస్తారని వార్తలు వస్తున్న వేళ, సొంత సోదరుడికే నమ్మకం కలిగించలేకపోయారని విశ్లేషకులు అంటున్నారు.
kamal hasan
tamilanadu
charuhasan

More Telugu News