Pakistan pacer: ఒక్క బంతి వేయడానికి ఐదుసార్లు ప్రయత్నించిన పాక్ పేసర్ వాహెబ్ రియాజ్!

  • క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన!
  • ఒక్క బాల్ వేసేందుకు ఐదు నిమిషాలకు పైగా తీసుకున్న బౌలర్
  • ఆగ్రహం వ్యక్తం చేసిన పాక్ కోచ్ మైక్ అర్థర్

బహుశా క్రికెట్ చరిత్రలోనే ఇది అరుదైన ఘటన కావొచ్చు. ఒక్క బంతి వేయడానికి ఏకంగా ఐదుసార్లు ప్రయత్నించిన క్రికెటర్‌గా పాకిస్థాన్ క్రికెటర్ వాహెబ్ రియాజ్ చరిత్ర కెక్కాడు. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. 111వ ఓవర్ వేస్తున్న రియాజ్ నాలుగో బంతిని వేసేందుకు అష్టకష్టాలు పడ్డాడు. ఒక్క బంతిని వేసేందుకు ఐదుసార్లు ప్రయత్నించి చివరికి ఆరోసారి విజయవంతమయ్యాడు. ఒక్క బంతి విసిరేందుకు ఐదు నిమిషాలకు పైగా తీసుకున్నాడు.

బంతి వేసేందుకు పరిగెత్తుకుంటూ వస్తున్న సమయంలో రిథమ్ తప్పడంతో మరోసారి ప్రయత్నించాడు. ఇలా మొత్తం ఐదుసార్లు బంతిని పట్టుకుని పరిగెత్తడంతో క్రీజులో ఉన్న శ్రీలంక బ్యాట్స్‌మన్ దిముత్ కరుణరత్నె విసుగుచెందడం కనిపించింది. రియాజ్ తీరుపై పాక్ కోచ్ మైక్ మిక్కీ అర్థర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

More Telugu News