President: ప్రత్యేకత చాటుకున్న రాష్ట్రపతి.. వర్షంలో తడుస్తూనే గౌరవ వందనం స్వీకరించిన కోవింద్

  • కేరళలో తొలిసారి పర్యటించిన ప్రథమ పౌరుడు
  • వర్షం పడుతున్నా గొడుగును నిరాకరించిన కోవింద్
  • ఆశ్చర్యపోయిన ముఖ్యమంత్రి, అధికారులు

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తానెంతటి నిరాడంబరుడో నిరూపించారు. తన ప్రత్యేకతను, హుందాతనాన్ని చాటుకున్నారు. కోవింద్ తొలిసారి ఆదివారం కేరళలో పర్యటించారు. ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ఆయన తిరువనంతపురం విమాశ్రయానికి చేరుకున్నారు. కేరళ గవర్నర్ పి.సదాశివన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్ తదితరులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. ఆ సమయంలో వర్షం బాగా పడుతోంది.

దీంతో భద్రతాధికారులు ఆయనకు గొడుగు పట్టేందుకు ప్రయత్నించగా కోవింద్ సున్నితంగా తిరస్కరించారు. వర్షంలో తడుస్తూనే తనకు సమర్పించిన గార్డ్ ఆఫ్ ఆనర్‌ను అందుకున్నారు. అనంతరం మాతా అమృతానందమయి పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఓ చారిటీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు హెలికాప్టర్‌లో కొల్లాం వెళ్లారు. రాష్ట్రపతి వర్షంలో తడుస్తూనే గౌరవ వందనాన్ని స్వీకరించడం చూసి అక్కడి వారు ఆశ్చర్యపోయారు. ఆయన హుందాతనాన్ని కొనియాడు.

More Telugu News