south Korea: ఉత్తరకొరియాతో సంబంధాలపై ఆసక్తికర ట్వీట్ చేసిన ట్రంప్!

  • 25 ఏళ్లుగా ఎందరో అధ్యక్షులు ఎడతెగని చర్చలు జరిపారు
  • ఉత్తరకొరియాకు భారీగా సొమ్ములు ముట్టజెప్పారు
  • అమెరికాతో ఆ దేశం చేసుకున్న అన్ని ఒప్పందాలను ఉల్లంఘించింది

ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాలు స్పష్టంగా చెప్పే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ఉత్తరకొరియా లక్ష్యంగా ఆసక్తికర ట్వీట్స్ చేశారు. ఈ ట్వీట్స్ లో గతంలో అమెరికా అధ్యక్షులు చేసిన పనిని వివరిస్తూ, ప్రస్తుత పరిస్థితిని ప్రతిబింబించారు.

‘ఎంతో మంది అధ్యక్షులు, వారి కార్యదర్శులు గత 25 ఏళ్లుగా ఉత్తరకొరియాతో ఎడతెగని చర్చలు జరిపారు. ఆ దేశానికి భారీగా సొమ్ములు ముట్టజెప్పారు. కానీ అవేవీ పనిచేయలేదు. మధ్యవర్తులను ఫూల్స్ చేస్తూ, కాగితాలపై సిరా ఆరిపోకముందే తాను చేసుకున్న ఒప్పందాలను ఆ దేశం ఉల్లంఘించింది. సారీ, కేవలం ఒకే ఒక్కటి దీనికి బాగా పనిచేస్తుంది..!’ అంటూ ఆయన ఉత్తరకొరియాతో యుద్ధం అనివార్యమని స్పష్టంగా ట్వీట్‌ చేశారు.

గత కొంత కాలంగా అమెరికా, ఉత్తర కొరియా అధ్యక్షుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 

More Telugu News