china: 13.4 లక్షల మంది అవినీతిపరులను శిక్షించిన చైనా!

  • స్వీపింగ్ యాంటీ కరప్షన్' కింద అవినీతి పరులను శిక్షించిన చైనా 
  • అవినీతిపరుల్లో 13,000 మంది ఆర్మీ అధికారులు
  • కమ్యూనిస్ట్ పార్టీ 19వ జాతీయ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అవినీతిపై ప్రకటన
‘స్వీపింగ్‌ యాంటీ కరప్షన్‌’ కార్యక్రమంలో భాగంగా చైనా భారీ స్థాయిలో అవినీతి అధికారులను శిక్షించింది. అక్టోబర్‌ 18న కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ చైనా (సీపీసీ) 19వ జాతీయ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో సెంట్రల్‌ కమిషన్‌ ఫర్‌ డిసిప్లిన్‌ ఇన్‌ స్పెక్షన్‌ (సీసీడీఐ) కు నేతృత్వం వహిస్తున్న వాంగ్‌ క్విషాన్‌ మాట్లాడుతూ, 2012 లో ప్రారంభించిన 'స్వీపింగ్ యాంటీ కరెప్షన్' కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 13.4 లక్షల మంది అవినీతి అధికారులను శిక్షించామని తెలిపారు.

ఇందులో 13 వేల మంది మిలటరీ అధికారులు కూడా ఉన్నారని ఆయన వెల్లడించారు. వీరంతా తమ అధికారం ఉపయోగించి, ఆర్మీ ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆయన తెలిపారు. వారిలో ఉన్నతాధికారులైన సెంట్రల్‌ మిలటరీ కమిషన్‌ (సీఎంసీ) వైస్‌ చైర్మన్‌ జనరల్‌ జు కైహూతోపాటు జనరల్‌ జూ బోక్సంగ్‌ కూడా ఉన్నారని ఆయన తెలిపారు. 
china
corruption
anti-corruption

More Telugu News