raj taraun: 'రాజుగాడు'లో రాజ్ తరుణ్ కి కూడా ఒక రకమైన జబ్బే!

  •  రాజ్ తరుణ్ తదుపరి చిత్రంగా 'రాజుగాడు' 
  •  నచ్చింది కొట్టేసే మనస్తత్వం
  •  ఫలితంగా ఎదురయ్యే పరిణామాలు
  •  కథానాయికగా అమైరా దస్తూర్    
ఈ మధ్య కథానాయకుడికి ఏదో ఒక బలహీనతో .. మానసిక పరమైన వ్యాధో వున్న కాన్సెప్ట్ లను దర్శకులు ఎంచుకుని, ఆ విషయంలో నుంచే కావలసినంత వినోదాన్ని పిండుతున్నారు. 'భలే భలే మగాడివోయ్' సినిమాలో నాని మతిమరుపుతో సందడి చేస్తే 'మహానుభావుడు'లో అతి శుభ్రతతో శర్వానంద్ నవ్వులు పూయించాడు.

 తాజాగా అదే తరహా కాన్సెప్టుతో 'రాజుగాడు' సినిమాతో రాజ్ తరుణ్ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. సంజనా రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, రాజ్ తరుణ్ కి ఎలాంటి లోటు లేకపోయినా దొంగతనం చేసే అలవాటు వుంటుందట. దాంతో ఆయన ఎక్కడికి వెళ్లినా 'చేతివాటం' ప్రదర్శిస్తూ ఉంటాడు. ఫలితంగా ఆయన ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందనేది వినోదభరితంగా వుంటుందని అంటున్నారు. రాజ్ తరుణ్ జోడీగా అమైరా దస్తూర్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.    
raj taraun
amyra dastur

More Telugu News