Anurag Kashyap: నా సినిమా సెట్లో ఎవరూ ప్రేమలో పడకూడదనే రూల్ ఉండేది.. బాలీవుడ్ దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్

  • తొలిసారి నేనే దానిని ఉల్లంఘించా
  • నటి కల్కి కోయెచిన్‌తో ప్రేమలో పడ్డా
  • జియో మామి ఫిల్మ్ ఫెస్టివల్‌లో అనురాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమా షూటింగ్ సమయంలో నటీనటులకు నిబంధనలు పెట్టే  బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. తన సినిమా షూటింగ్ సెట్లో నటీనటులు ఎవరూ ప్రేమలో పడకూడదనే నిబంధన ఉండేదని, అయితే తొలిసారి తానే దానిని ఉల్లంఘించినట్టు వివరించాడు. ‘జియో మామి ఫిల్మ్ ఫెస్టివల్’ 19వ ఎడిషన్ మూవీ మేళాలో ఆయనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఫెస్టివల్‌కు హాజరైన అభిమానులు, ఫిల్మ్ మేకర్లను ఉద్దేశించి అనురాగ్ మాట్లాడుతూ .. తన సినిమా షూటింగ్ సెట్లో నటీనటులు ఎవరూ ప్రేమలో పడకూడదనే రూల్ ఉండేదని పేర్కొన్నాడు. 2009లో ‘దేవ్ డి’ సినిమా చిత్రీకరణ సమయంలో ఈ నిబంధన విధించినట్టు తెలిపాడు. అయితే విచిత్రంగా ఇదే సినిమాలో ఆ రూల్‌ను స్వయంగా తానే ఉల్లంఘించినట్టు పేర్కొన్నాడు. ఈ సినిమాలో చంద్రముఖిగా నటించిన నటి కల్కి కోయెచిన్‌తో ప్రేమలో పడినట్టు వివరించారు. రెండేళ్లపాటు ప్రేమలో మునిగి తేలిన వీరిద్దరూ 2011లో వివాహం చేసుకున్నారు. అయితే, వీరి వివాహం ఎక్కువ కాలం కొనసాగలేదు. 2015లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.
Anurag Kashyap
Kalki Koechlin
Bollywood
Filmmaker

More Telugu News