honeypreet: పరారీలో ఉన్న‌ప్పుడు 17 సిమ్ కార్డులు మార్చిన హ‌నీప్రీత్‌!

  • అందులో మూడు అంత‌ర్జాతీయ సిమ్ కార్డులు
  • ఆ దిశగా విచార‌ణ ప్రారంభించే యోచ‌న‌లో పోలీసులు
  • 38 రోజులు పోలీసుల‌ను ఇబ్బంది పెట్టిన డేరా బాబా ప్రియురాలు

బాబా గుర్మీత్ సింగ్ రామ్ ర‌హీమ్‌కు జైలు శిక్ష పడిన త‌ర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఆయ‌న ప్రియురాలు హ‌నీప్రీత్ అక్టోబ‌ర్ 3న అరెస్టైన సంగ‌తి తెలిసిందే. 38 రోజుల పాటు సిట్ పోలీసుల‌ను ముప్పుతిప్పలు పెట్టిన హ‌నీప్రీత్ ప‌రారీ స‌మ‌యంలో 17 సిమ్ కార్డులు మార్చిన‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. అందులో మూడు సిమ్ కార్డులు అంత‌ర్జాతీయ సేవ‌లు అంద‌జేసేవ‌ని స‌మాచారం.

 అయితే ఈ సిమ్ కార్డులు విదేశాల్లో తీసుకున్నవా? లేక స్థానిక సిమ్ కార్డుల‌కే ఐఎస్‌డీ సౌక‌ర్యం క‌ల్పించారా? అన్న విష‌యం తేల్చాల్సి ఉంది. హ‌నీప్రీత్ అరెస్టైన‌ప్ప‌టికీ విచార‌ణ‌కు ఆమె పెద్ద‌గా స‌హ‌క‌రించ‌డం లేదు. దీంతో సిమ్ కార్డుల ఆధారంగా ఏదైనా క్లూ క‌నిపెట్టే దిశ‌గా విచార‌ణ ప్రారంభించాల‌ని పోలీసులు యోచిస్తున్నారు. ప‌రారీలో ఉన్న‌ప్పుడు తాను వాడిన మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డుల గురించి ప్ర‌శ్నించ‌గా త‌న మొబైల్ పోయింద‌ని, ఎక్క‌డ పోయిందో గుర్తులేద‌ని హ‌నీప్రీత్ స‌మాధానం చెప్పింది.

అజ్ఞాతంలో ఉన్నప్పుడు హ‌నీప్రీత్‌కి స‌హాయ‌ప‌డిన సుఖ్‌దీప్ కౌర్ కొన్ని ముఖ్య విష‌యాల‌ను వెల్ల‌డించింది. `హ‌నీప్రీత్ చాలా సిమ్ కార్డులు వాడింది. వాటిలో కొన్నింటిని ఆమె నాశ‌నం చేసింది. అజ్ఞాతంలో ఉన్న‌ప్పుడు ఆమె నివాసం ఉన్న త‌ర‌న్‌-త‌ర‌న్ గ్రామంలో ఆమె ఫోన్ ఉండి ఉండొచ్చు` అని సుఖ్‌దీప్ కౌర్ తెలిపింది. హ‌నీప్రీత్ మొబైల్ దొరికితే 38 రోజులు ఆమెకు ఎవ‌రు స‌హాయం చేశారో తెలుసుకోవ‌చ్చు.

More Telugu News