hindi director: హిందీ చిత్ర దర్శకుడు కుందన్ షా కన్నుమూత

  • గుండెపోటుతో మృతి
  • `జానే భీ దో యారో` సినిమా తీసిన కుంద‌న్‌
  • చివ‌రి చిత్రం `పీ సే పీఎం త‌క్‌`
హిందీలో `జానే భీ దో యారో`, `క‌భీ హా క‌భీ నా` వంటి మాస్ట‌ర్‌పీస్ చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన కుంద‌న్ షా క‌న్నుమూశారు. శ‌నివారం ఉద‌యం గుండెపోటుతో ఆయ‌న త‌న నివాసంలో మృతి చెందిన‌ట్లు తెలుస్తోంది. సినిమాల‌తో పాటు `నుక్క‌ద్‌`, `వాగ్లే కీ దునియా` వంటి టీవీ సీరియ‌ళ్ల‌కు కుంద‌న్ షా దర్శ‌క‌త్వం వ‌హించారు.

ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చివ‌రి సినిమా `పీ సే పీఎం త‌క్‌`. ఈ చిత్రం 2014లో విడుద‌లైంది. సెటైరిక‌ల్ కామెడీకి మారుపేరుగా ఆయ‌న చిత్రాలు నిలిచాయి. ఆయ‌న మృతిపై ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేశారు.
hindi director
kundan shah
heart attack
death
kabhi ha kabhi na

More Telugu News