ntr: ఒక కోణంలోనే సినిమా తీయాల‌నుకోవ‌డం స‌బ‌బు కాదు: `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌` సినిమా గురించి పురంధేశ్వ‌రి

  • మ‌హ‌నీయుడి జీవితాన్ని బ‌జారుకీడ్చొద్దు
  • ఆర్జీవీని అభ్య‌ర్థించిన బీజేపీ నేత‌
  • ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించిన పురంధేశ్వ‌రి

ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్త‌క‌మ‌ని, ఆయ‌న‌కు సంబంధించిన అన్ని విష‌యాలు అంద‌రికీ తెలుసు‌న‌ని, సినిమా తీస్తే ఆయ‌న గౌర‌వాన్ని పెంచేలా ఉండాలి గానీ ఒక్క కోణంలో సినిమా తీయాల‌నుకోవ‌డం స‌బ‌బు కాద‌ని పురంధేశ్వ‌రి అన్నారు. ఇటీవ‌ల ఆమె ఓ ఇంట‌ర్వ్యూలో ఈ మాటలు చెప్పారు. ఎన్టీఆర్ జీవితం ఆధారంగా ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తీయ‌నున్న `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌` సినిమాపై ఆమె స్పందించారు.

ఆంధ్రుల‌కు ఆత్మ‌గౌర‌వం అంటే ఏంటో అర్థం చెప్పిన వ్య‌క్తి నంద‌మూరి తార‌క‌రామారావు అని గ‌తంలో రామ్ గోపాల్ వ‌ర్మ అన్న మాట‌ల‌ను ఆమె గుర్తు చేశారు. అలాంటి మ‌హానీయుడిని బ‌జారుకీడ్చొద్ద‌ని ఆమె ఆర్జీవీని అభ్య‌ర్థిస్తున్న‌ట్లు తెలిపారు. `ఒక‌వేళ సినిమా తీయాలనుకుంటే, నిర్మాణాత్మ‌కంగా ఎన్టీఆర్ జీవితంలో జ‌రిగిన‌ అన్ని విష‌యాల‌ను చూపించే ప్ర‌య‌త్నం చేయాలి త‌ప్ప ఇలా ఏక కోణంలో సినిమా నిర్మించాల‌నుకోవ‌డం స‌రికాదు` అని పురంధేశ్వ‌రి అన్నారు.

More Telugu News