raviteja: దీపావళికి 'రాజా ది గ్రేట్' .. సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తా : దిల్ రాజు

  • టాలీవుడ్ లో దీపావళికి పెద్దగా సినిమాలు రిలీజ్ చేయరు
  •  మంచి ఫలితాలు రావనే అభిప్రాయం
  •  ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తామంటోన్న దిల్ రాజు
  •  ఆయన నిర్మాతగా ఈ నెల 19న రానున్న 'రాజా ది గ్రేట్'

సాధారణంగా బాలీవుడ్ లోను .. కోలీవుడ్ లోను దీపావళికి భారీస్థాయిలో సినిమాలు విడుదలవుతుంటాయి. దీపావళి సెంటిమెంట్ తో కొంతమంది హీరోలు ఆ దిశగా ముందుగా ప్లాన్ చేసుకునే తమ సినిమాలను ఆ పండుగకి విడుదల చేస్తుంటారు. అయితే టాలీవుడ్ లో మాత్రం అమావాస్య పండుగగా చెప్పుకునే దీపావళికి తమ సినిమాలను విడుదల చేయడానికి దర్శక నిర్మాతలుగానీ .. హీరోలుగాని పెద్దగా ఆసక్తిని చూపించరు.

 ఈ పండుగకి సినిమాలు విడుదల చేస్తే మంచి ఫలితాలు రావనేది వాళ్ల అభిప్రాయం. అయితే దీపావళికి 'రాజా ది గ్రేట్' సినిమాను రిలీజ్ చేసి, ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తామని నిర్మాత దిల్ రాజు అన్నారు. దసరా .. సంక్రాంతి మాదిరిగానే దీపావళి కూడా తెలుగు సినిమాలకి మంచి సీజన్ అనే విషయాన్ని తాము ఈ సినిమాతో నిరూపిస్తామని చెప్పారు. రవితేజ .. మెహ్రీన్ జంటగా నటించిన ఈ సినిమా, ఈ నెల 19వ తేదీన విడుదలవుతోన్న సంగతి తెలిసిందే.    

More Telugu News